
జిల్లా స్థాయిలో స్వచ్ఛ బడి నాటక పోటీలలో వెంకట్రావు పేట ద్వితీయ స్థానం సాదించిందని, ప్రధానోపాధ్యాయులు నయీమా కౌసర్ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..జిల్లా కేంద్రం సిద్దిపేటలో జరిగిన స్వచ్ఛ బడి నాటక పోటీ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వలన నష్టాలు, నాటక పోటీలు నిర్వహించారని అన్నారు. ఈ నాటక పోటీలలో వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ నాటకాని కి ద్వితీయ స్థానం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నాటక కార్యక్రమంలో విద్యార్థులు శ్రీకాంత్, ఐశ్వర్య, అశ్విత, యశ్వంత్, నవీన్ అద్భు తమైన ప్రదర్శనను కనపర్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సహకరించిన ఉపాధ్యాయ బృందా నికి, విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు అభి నందనలు తెలిపారు.