మీ అందర్నీ నవ్వించే సినిమా : వెంకటేష్‌

A movie that will make you all laugh : Venkateshవెంకటేష్‌, మీనాక్షిచౌదరి, ఐశ్వర్య రాజేష్‌ నాయకానాయికలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌ బస్టర్‌ మ్యూజికల్‌ నైట్‌ ఈవెంట్‌ని మేకర్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో వెంకటేష్‌ లైవ్‌లో ‘బ్లాక్‌ బస్టర్‌ పొంగల్‌..’ సాంగ్‌ పాడటంతోపాటు స్టెప్పులు వేయడం అందరినీ ఉర్రూతలూగించింది. వెంకటేష్‌ మాట్లాడుతూ, ‘ఇది నా 76వ సినిమా. అనిల్‌ వండర్‌ ఫుల్‌ స్క్రిప్ట్‌తో వచ్చారు. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. నా అభిమానులు ఇలాంటి సినిమాలని చాలా ఇష్టపడతారు. వాళ్ళ ప్రేమ ఎప్పుడూ చూపిస్తూనే వున్నారు. మళ్ళీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం. మీరంతా ఫ్యామిలీతో రావాలి. చాలా ఎంటర్‌టైన్మెంట్‌, నవ్వులు ఉంటాయి’ అని తెలిపారు.