భారత రాజ్యాంగం కల్పించిన పేద ప్రజల బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) రాష్ట్ర కమిషనర్ ను వెంటనే నియమించాలని యునైటెడ్ ఫోరం పర్, ఆర్టిఐ భూపాలపల్లి, జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోజున, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కేంద్రంలో, ఆర్టీఐ మండల కన్వీనర్ ముత్తోజు, వేణా చారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వ కాలం నుండి రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ లేక సెక్షన్ 19(3) ప్రకారం పరిష్కరించవలసిన సమస్యలు, దరఖాస్తులు ఎన్నో పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో ప్రతి భారత పౌరుడు సామాజిక బాధ్యతగా అవినీతి అక్రమాలను నిరోధించడానికి పేద ప్రజలకు ఆర్టీఐ ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.గత ప్రభుత్వ పాలన కాలంలో లోటుపాట్లను కప్పిపుచ్చడానికే ఆర్టీఐని నిర్వీర్యం చేశారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కమిషనర్ నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాటారం సబ్ డివిజన్ ఆర్టీఐ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యుడు సభ్యుడు గాధం పోచయ్య, మడిపోజుల నరేశ్, పిల్లి ఓం ప్రకాష్, కొమ్ముర అశోక్తది తరులు పాల్గొన్నారు.