– అతిథులకు ఆహ్వాన పత్రిక అందజేత : మాజీ సర్పంచ్
నవతెలంగాణ-తలకొండపల్లి
ఈనెల 24 నుంచి మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మౌత్సవాలు, 31 అంతరాష్ట్ర బండలాగుట పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు మాజీ సర్పంచ్ కడమోని శ్రీశైలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోనీ ఎద్దుల పందెం బహుమతుల దాత శతాబ్ది టౌన్‌షిప్ చైర్మెన్ కాసు శ్రీనివాస్ రెడ్డి, జున్న సోలార్ చైర్మెన్ శేఖర్ రెడ్డిల నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యం, జంగయ్య, లక్ష్మయ్య, యాదయ్య, శంకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.