– ఆలయ ఈవో ప్రభు రామచంద్రం
నవతెలంగాణ – కామారెడ్డి
మాచారెడ్డి మండలం గజ్య నాయక్ తండ క్రాస్ రోడ్ లో గల శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావుల అంతయ్య అండ్ సన్స్ కుటుంబానికి సంబంధం లేదని ఆలయ ఈవో ప్రభు రామచంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావుల అంతయ్య అండ్ సన్స్ కు సంబంధం ఉన్నట్లు కొన్ని పత్రికలలో ప్రచురితమైందని, ఈ గుడికి ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ ఆలయానికి మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన గంధం రాజగోపాల్ రెండు ఎకరాల, 5 గుంటల భూమిని ఇచ్చారని ఆ ప్రకటనలో తెలిపారు. గంధం రాజగోపాల్ కుటుంబ సభ్యులలో ఎవరైనా తమ పూర్వీకుల పేరును శిలాఫలకాలపై పెట్టాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే తాము దానిని పై అధికారులకు పంపి, అధికారుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనీ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.