నవతెలంగాణ – తొగుట
వెంకట్రాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చిలి వేరీ మాల్లారెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి మండలం లోని లింగంపేట గ్రామంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా మన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల న్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసి దొంగ ప్రమాణాలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి మాటలను తెలం గాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్య క్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ అభిద్ హుస్సే న్, మాజీ ఉప సర్పంచ్ మంగ యాదగిరి, పార్టీ సీనియర్ నాయకులు సంకుర్తి నర్సాగౌడ్, మాజీ సర్పంచ్ గొడుగు ఐలయ్య, నాయకులు ఎస్. సుధాకర్, యూత్ సభ్యులు ఎస్. ప్రకాష్, జి. తరుణ్, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.