
నవతెలంగాణ – తొగుట
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి. వెంకట్రామరెడ్డి ఘన విజయం సాధిం చడం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చందాపూర్, పెద్ద మసాన్ పల్లి లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా మని, 2 లక్షల ఋణమాపీ, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం డోఖా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగు, సాగు నీటి గోస మొదలైందన్నారు. బీజేపీ తెలంగాణ కు చేసిందేమీ లేదన్నారు. కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి రూ. 100 కోట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ, యువకులకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింస్తారని అన్నా రు. అంతకుముందు పెద్ద మసాన్ పల్లి ఎల్లమ్మ దేవాలయంలో, చందాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బెజ గామ సుభాష్ గౌడ్, బోయిని శ్రీనివాస్ ఏఎంసీ
మాజీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయ కులు కనుక గౌడ్, మహిపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు