నర్కూడలో ‘విష జ్వరాలు’

'Poison Fever' in Narkuda– విజృంభిస్తున్న దోమలు, ఈగలు
– స్వచ్ఛదనం గాలికి, తాగునీరు కలుషితం మిలిత తాగునీటి సరఫరా
– బ్లీచింగ్‌, ఫాగింగ్‌ మాటేలేదు
– తాగటానికి ‘ఫిల్టరే’ దిక్కు
నవతెలంగాణ-శంషాబాద్‌
నర్కూడ గ్రామ పరిసరాలను చూస్తే చెత్త చె దారం లేదు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లు పరి శుభ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఇంతబాగా స్వ చ్ఛదనం నిర్వహిస్తే సీజనల్‌ వ్యాధులు ఎందుకు వ స్తున్నాయి ? ప్రజలంతా ప్రయివేట్‌ ఆస్పత్రులకు పరుగులు ఎందుకు తీస్తున్నారు ? ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. అధికారులు పరిశుభ్రత కార్యక్రమాలకు అంత ప్రాధాన్యత ఇస్తు న్నారా ఇస్తే ఈ పరిస్థితి ఎందుకు దాపరిస్తున్నది. సీజనల్‌ వ్యాధులు చుట్టుముట్టి రోగాల బారిన ప డుతుంటే అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవ డం లేదు. శంషాబాద్‌ మండలంలో నర్కూడ గ్రా మంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న విషయం పై ప్రత్యేక కథనం. ఈ గ్రామంలో సుమారు 7 వేల జనాభా ఉన్నది. ఇక్కడ చాలా మేరకు ప్రజలు సీజ నల్‌ వ్యాధులు బారినపడుతున్నారు. ఉన్నట్టుండి విషజ్వరాలతో ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పీహెచ్‌సీలో తగిన సౌకర్యాలు లేక డా క్టర్లు అందుబాటులో లేక ప్రజలు ప్రయివేటుకు వె ళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. అక్కడ వైద్య ఫీజులు కట్టడానికి అప్పులు చేసి ఉన్న బంగారం నగలు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. గ్రామంలో స్వ చ్ఛదనంపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫా యిడ్‌, వాంతులు విరేచనాల వంటి సీజనల్‌ వ్యా ధులు పెరిగిపోతున్నాయి. సీజనల్‌ వ్యాధుల్లో ప్ర ధానంగా చిన్నపిల్లలే బాధితులుగా ఉంటు న్నారు.
బ్లీచింగ్‌, ఫాగింగ్‌ లేదు…
సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని అవసరమున్న చోట ల్లా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, తరచు ఫాగింగ్‌ చేయ డం జరగాలి కానీ అలాంటి చర్యలు ఏమీ అధికా రులు తీసుకోవడం లేదు. వానాకాలం ప్రారంభం నుంచి పండగల సమయంలో తప్ప గ్రామంలో బ్లీ చింగ్‌ పౌడర్‌ చల్లడం, ఫాగింగ్‌ చేసిన దాఖలాలు లేవు. వివిధ బస్తీల్లో దోమలు ఈగలు ముసిరి వివి ధ రకాల సీజనల్‌ వ్యాధులు వస్తున్నాయి.
గ్రామంలో వాహనాల రద్దీతో పాటు ఉత్సవ ఊరేగింపులు ఎక్కువయ్యాయి. ధ్వని, కాంతి కాలు ష్యంతో పాటు ప్రత్యేక గొట్టాల ద్వారా రంగులు చె త్తగాల్లోకి వదులుతున్నారు. ఈ కారణంగా కా లుష్యం పెరిగింది. ఉత్సవాల వల్ల వెలువడు తున్న వ్యర్థాలు సగానికి పైన మట్టిలో కలిసి దోమలు, ఈగలు విపరీతంగా పెరిగాయి. వాటి నియంత్ర ణకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ బదులు సున్నం చల్లడం అలవాటుగా మారింది. అధికారులు మా త్రం బ్లీచింగ్‌ చల్లినట్లు, ఫాగింగ్‌ చేసినట్లు రికార్డు లలో నమోదు చేస్తు డబ్బులు కాజేస్తున్నారు.
మిలిత నీటి సరఫరా
మిషన్‌ భగీరథ నీళ్లు-బోర్‌ వాటర్‌ నీళ్ళు కలిపి గ్రామంలో సరఫరా చేస్తున్నారు. శుభ్ర పరిచిన మి షన్‌ భగీరథ నీరు శుభ్రం చేయని బోర్‌ వెల్‌ నీటిని కలిపి సరఫరా చేయడం వల్ల ఆ నీరు తాగితే ఆరో గ్య సమస్యలు వస్తున్నాయి.
‘ఫిల్టరే’ దిక్కు
మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతున్నప్ప టికీ తాగడానికి వంట చేసుకోవడానికి ఫిల్టర్‌ వాట ర్‌ దిక్కయింది. మిషన్‌భగీరథ సరఫరా కన్నా ముం దు నుంచి ప్రజలు ఫిల్టర్‌ వాటర్‌ కొని తాగాల్సి వస్తున్నది. ఫిల్టర్‌ వాటర్‌ నీటి ప్రమాణాలు పరిశీ లించిన దాఖలు లేవు. ఫిల్టర్‌ వాటర్‌ నిర్వాహకుల అర్హత, నిర్వహణపై పర్యవేక్షణ లేదు.
ప్రభుత్వం మారినా
అధికారుల తీరులో ఏలాంటి మార్పూ లేకపో వడంతో ఇంత పెద్ద గ్రామంలో సీజనల్‌ వ్యాధులకు కొదవ లేకుండా పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిర్దేశిత లక్ష్యాల కోసం పరితపించడమే తప్ప సీజ నల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన అంశాలపై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పటికైనా అధికారు లు వెంటనే చర్యలు తీసుకొని సీజనల్‌ వ్యాధులు పెరగకుండా నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.