నవతెలంగాణ-తుర్కపల్లి
డీటీసీపీ లే అవుట్ ప్రకారం వెంచర్ యజమానులు 10శాతం భూమిని గ్రామపంచాయతీకి కేటాయించాలని ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్‌నాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా వెంచర్ యజమానులు ఆన్‌లైన్‌లోనే అమ్మకాలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంచర్లలో అన్ని అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాతనే ప్లాట్లను అమ్ముకోవాల్సి ఉంటుందని ఈ నిబంధనలను పాటించకుండా వెంచర్ యజమానులు పంచాయతీ కార్యదర్శులతో కుమ్ముకై ప్లాట్లను ఆన్‌లైన్ల్ అమ్మకాలు చేపడుతున్నట్లు ఎంపీటీసీలు గిద్దె కరుణాకర్, మోహన్ బాబులు అధికారులను ప్రశ్నించారు. చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో అసైన్డ్ ల్యాండ్‌ను అధికారులు గుర్తించాలని ఎంపీటీసీ అధికారులను అడిగారు. తుర్కపల్లి మండల కేంద్రంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వాలని, అర్హులకు కేటాయించారని మండల కేంద్రానికి చెందిన సర్పంచ్‌గా తనను ఆహ్వానించలేదని సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్ ఆరోపించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొత్త బస్తాలని వాడాలని సభ్యులు అధికారులను అడిగారు. ఈ సందర్భంగా ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, జెడ్పీ వైస్ చైర్మెన్ ధనావత్ బిక్కు నాయక్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి కేసిఆర్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీడీవో మానే ఉమాదేవి ,ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్ యాదవ్ ,గిద్దె కరుణాకర్, పలుగుల నవీన్ కుమార్ ,మోహన్ బాబు, బోర్ల శ్రీలత, కోమటిరెడ్డి సంతోష, ప్రతిభ రాజేష్, కో ఆప్షన్ సభ్యుడు రహమత్, సర్పంచులు పడాల వనిత శ్రీనివాస్, పోగుల ఆంజనేయులు, నాగారం మహేందర్, ఇమ్మడి మల్లప్ప, శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు ప్రభాకర్ రెడ్డి, మీనా పండు, నాంసాన్ సత్యనారాయణ ,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.