
జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఏడీ గా పదోన్నతి పై వచ్చిన ఎస్.వేణుగోపాల్ గౌడ్ ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలని పరిష్కరించాలని బీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అన్ని రకాల పాఠశాలలలో చదువుతున్నటువంటి బీసీ విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నర్సా గౌడ్, అధికార ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేకల అశోక్, సత్యనారాయణ, సెక్టోరియల్ అధికారి జెట్టి నారాయణ, డీఈఓ కార్యాలయ సి.సి రాజేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ సతీష్ పాల్గొన్నారు.