మంత్రి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపిన వేణుగోపాల్ యాదవ్

నవతెలంగాణ కమ్మర్ పల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన నూతన మంత్రివర్గంలో పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీతక్కను పిసిసి  అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాదులో మంత్రి  సీతక్క ను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క గొప్ప పోరాటయోధురాలని, అణగారిన వర్గాల ప్రజలను అక్కున చేర్చుకోవడంలో మంత్రి సీతక్క ఎల్లవేళలా ముందుంటారని ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ పేర్కొన్నారు.