తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని హోటల్ ఎల్ల లో రేవంత్ రెడ్డిని కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. పది సంవత్సరాలు కార్యకర్తల పోరాట ఫలితంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ ప్రతి నాయకునికి భవిషత్తు ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పినట్లు వేణుగోపాల్ యాదవ్ తెలిపారు.