తీర్పు హర్షణీయం : ఐద్వా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బిల్‌ కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. బిల్‌కిస్‌ బానో కేసులో సుంప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని తెలిపారు. కేసులోని దోషులకు క్షమాభిక్ష మంజూరు చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసిందని పేర్కొన్నారు. గ్యాంగ్‌ రేప్‌, మర్డర్‌ కేసులో దోషులుగా ఉన్న 11 మందిని ముందుగానే జైలు నుంచి విడుదల చేయటాన్ని బిల్‌ కిస్‌ బానో సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి క్షమాభిక్షను రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపట్ల మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నదని తెలిపారు.