కామారెడ్డి జిల్లాలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కేజీబీవీ లలో తాత్కాలిక పద్ధతి పై ప్రత్యేక అధికారులు పీజీ సిఆర్టిసిలు, సిఆర్టిసిల, పీఈటీల యొక్క కాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెరిట్ కం రోస్టర్ ప్రకారం 1:3 అభ్యర్థులకు గురువారం జిల్లా కార్యాలయం రూమ్ నెంబర్ 223 కలెక్టరేట్లో నిర్వహించబడుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వచ్చేవారు వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ ఒక కాఫీ జిరాక్స్ సెట్ తీసుకురావాలని, వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన తదుపరి వివరాలు సూచనలు మార్గదర్శకాలను www.deokamareddy.in వైఫ్ సెట్ యందు పొందుపరచడం జరిగిందని ఆయన ప్రకటనలో తెలిపారు.