ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే బహుముఖం

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే బహుముఖంనటుడు హర్షివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘బహుముఖం’ అనే టైటిల్‌ పెట్టారు. గుడ్‌, బ్యాడ్‌ అండ్‌ యాక్టర్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌ అట్లాంటా, మాకాన్‌, కాంటన్‌, జార్జియా, యుఎస్‌ఏ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హర్షివ్‌ కార్తీక్‌ కాంప్లెక్స్‌ క్యారెక్టర్‌ కనిపిస్తోంది. స్వర్ణిమా సింగ్‌, మరియా మార్టినోవా కథానాయికలు. క్రిస్టల్‌ మౌంటైన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి అరవింద్‌ రెడ్డి సహ నిర్మాత. ల్యూక్‌ ఫ్లెచర్‌ సినిమాటోగ్రాఫర్‌ కాగా, శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చారు. హర్షివ్‌ కార్తీక్‌ డైలాగ్స్‌ అందించారు.