రాజ్ తరుణ్ హీరోగా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర మ్యూజికల్ ప్రొమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని ‘చాలా బాగుందే’ పాటని విడుదల చేశారు. మనసుని హత్తుకునే హార్ట్ ఫుల్ లైవ్లీ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జేెబి. చైతు సత్సంగి, లిప్సిక ఈ పాటని మ్యాజికల్‌గా పాడారు. శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా ఉంది. ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమెరా మెన్‌గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్‌గా, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజరు, అంకిత ఠాకూర్, పధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.