ఓటీటీలోనూ విశేష ఆదరణ

Very popular in OTTఅజయ్ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో అజయ్ ఘోష్‌ మాట్లాడుతూ, ”ప్రతి మనిషి జీవితంలో జరిగే కథే ఇది. సక్సెస్‌ అయిన వారెవరైనా ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కతజ్ఞతలు. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా చూసి, ఫోన్‌ చేసి అభినందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగున్నాయని చెప్పారు. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్‌. శివ సినిమాను బాగా రూపొందించారు’ అని తెలిపారు. ‘ఈ కథ విన్నప్పుడే దీనిపై నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. బాగా ట్రెండ్‌ అవుతోంది. ఆడియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌’ అని హీరోయిన్‌ చాందినీ చౌదరి చెప్పారు. ముఖ్య అతిథిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,’ఈ సినిమాను చాలా డిఫరెంట్‌గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు’ అని అన్నారు.