
మండలంలోని రెడ్డి పేటలో గురువారం పశుసంవర్ధక శాఖ ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని మండల వైద్యాధికారి రామచంద్రర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామచంద్ర మాట్లాడుతూ.. పాడి పశువులు 15 నెలలకు ఒక ఈత ఈనెల ప్రణాళికతో ఉండాలని సూచించారు. 15 సాధారణ చికిత్సలు, 55 గర్భకోశ వ్యాధులు చికిత్సలు, నాలుగు కృతిమ గర్భధారణలు, 15 దూడలకు నట్టల నివారణ మందులను అందజేసినట్లు రామచందర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వి ఎల్ వో శ్రీనివాసరావు, జె వి ఓ లు కొండల్ రెడ్డి, నారాయణ, వి ఏ రమేష్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.