– తెలుపు నలుపు పశువులకు గాలి కుంటు వ్యాధి కి టీకాలు: డాక్టర్ స్వప్న
నవతెలంగాణ – అశ్వారావుపేట
పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో ఈ నెల 16 తేదీ బుధవారం నుండి వచ్చేనెల 4వ తేదీ సోమవారం వరకు మండలంలోని గ్రామాలు వారీగా తెలుపు నలుపు పశువులకు ‘గాలి కుంటు’ నివారణ టీకాల పశువైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశు సంవర్ధక శాఖ మండల అధికారిణి డాక్టర్ స్వప్న మంగళవారం తెలిపారు. ఈ గాలి కుంటు వ్యాధి వలన పశువులు కుంటుతూ నడవడంతో సరిపడా మేత మేయక నీరసించి పోతాయని, పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గి పోతుందని, కావున ప్రతీ పశువుకి యజమానులు ఈ టీకా వేయించుకోవాలని మనవి చేసారు. ఆమె తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. మండలంలోని మొత్తం 17,178 తెలుపు నలుపు పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో 9,140 ఆవులు ఎడ్లు, దూడలు,7,768 గేదెలు, దున్నపోతులు, దూడలు ఉన్నాయని, ఈ పశువుల యజమానులు ఈ పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ నెల అక్టోబర్ 16 వ తేదీ బుధవారం నారాయణపురం.
17 గురువారం మల్లాయిగూడెం,పండు వారి గూడెం.
18 శుక్రవారం అనంతారం,రామన్నగూడెం,గాండ్లగూడెం.
19 శనివారం కావడి గుండ్ల.
21 సోమవారం కన్నాయిగూడెం.
22 మంగళవారం గుమ్మడి వల్లి.23 బుధవారం కోయ రంగాపురం,బచ్చువారిగూడెం,ఖమ్మం పాడు.
24 గురువారం వేదాంత పురం ,ఊట్లపల్లి.
25 శుక్రవారం వినాయక పురం,ఆసుపాక.
26 శనివారం గుంటిమడుగు.
28 సోమవారం నందిపాడు,దురద పాడు.
29 మంగళవారం మొద్దులమడ,సున్నం బట్టి.
30 బుధవారం తిరుమలకుంట,రెడ్డిగూడెం.
వచ్చే నెల నవంబర్ 1 శుక్రవారం మామిళ్ళవారిగూడెం,అచ్యుతాపురం.
2 శనివారం మద్దికొండ,జమ్మి గూడెం.
4 సోమవారం నారావారి గూడెం లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, పైన తెలిపిన తేదీలు ప్రకారం పశువైద్య శాఖ స్థానిక సిబ్బంది ఒక రోజు ముందుగానే ఆయా గ్రామాల పశు యజమానులకు సమాచారం ఇస్తారని వివరించారు.ఈ సదావకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.