మండలంలోని మోషన్ పూర్ లో మంగళవారం రాష్ట్ర పశుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో 40 సాధారణ చికిత్సలు, 51 గర్భకోష వ్యాధుల చికిత్స,1 కృత్రిమ గర్భాధారణ, 22 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగిందని మండల పశువైద్యాధికారి రామ్ చందర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశు గణభివృద్ధి సంస్థ కార్య నిర్వహణ అధికారి డాక్టర్ మజీద్, వి ఎన్ ఓ శ్రీనివాసరావు, జేవివో ఆంజనేయులు, గోపాలమిత్ర సూపర్వైజర్ కృష్ణ, హారిక, రైతులు రాజిరెడ్డి, రాములు, అనిల్ రెడ్డి, రాజు, భూమయ్య, సంతోష్లు తదితరులు పాల్గొన్నారు.