నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రారుబరేలీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి మద్దతుగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బుధవారం రారుబరేలీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంకజ్ తివారీతో ఆయన చర్చించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు.