వికలాంగులకు అండగా వీహెచ్‌పీఎస్‌

VHPS supports the disabled– సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ల జంగయ్య
– యాచారంలో వీహెచ్‌పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-యాచారం
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అండతో వికలాంగుల సంక్షేమానికి వీహెచ్‌పీఎస్‌ నిత్యం పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. సోమవారం యాచారం మండలం కేంద్రంలో వీహెచ్‌పీఎస్‌ సంఘం ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా జెండావిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో వికలాంగుల గౌర వాన్ని నిలబెట్టేందుకు వీహెచ్‌పీఎస్‌ సంఘం జెం డాను ఆవిష్కరించినట్టు తెలిపారు. వారి సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం పోరాటాలు నిర్వహించి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. మందకృష్ణ మాదిగ ఉద్యమంతోనే వికలాంగుల పింఛన్‌ పెరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్‌ సంఘం నాయకులు జంగయ్య, మహమ్మద్‌ సలీం, సాయిలు, శ్రీనివాస్‌, మాధవస్వామి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.