– నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు రూ.4,122 కోట్ల పెట్టుబడులు
నవ తెలంగాణ – హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ ఐడియా (విఐ) 4జి అత్యుత్తమ నెట్‌వర్క్ సేవలను అందిస్తుందని క్లస్టర్ బిజినెస్ హెడ్ (తెలంగాణ,ఏపీ, కర్నాటక) ఆనంద్ దానీ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 4జి విభాగంలో డౌన్‌లోడ్ స్పీడ్, వీడియో ఎక్స్‌పీరియన్స్, లైవ్ వీడియో అనుభవం, వాయిస్ యాప్ సేవల్లో విఐ మార్కెట్ లీడర్‌గా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఈ క్లస్టర్‌లో నెట్‌వర్క్ విస్తరణ, మెరుగుదల కోసం రూ.4,122 కోట్ల పెట్టుబడులు పెట్టామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 5జి సేవలను ప్రారంభించనున్నామన్నారు. ఇటీవల దక్కించుకున్న 250మెగాహెడ్జ్ స్పెక్ట్రంతో పైలట్ ప్రాజెక్టు ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన విఐ హీరో రీచర్జ్ ప్లాన్ విజయవంతం అయ్యిందని.. 50-60 శాతం మంది ఖాతాదారులు దీన్ని వినియోగించుకుంటున్నారన్నారు.