పీజీ పరీక్షలు తనిఖీ చేసిన వైస్ ఛాన్సలర్

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా దక్షిణ ప్రాంగణంలో పీజీ పరీక్ష కేంద్రాన్ని వైస్ ఛాన్సలర్ ప్రో. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రో.యాదగిరి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని  తెలుసుకొని పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. దక్షిణ ప్రాంగణం గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, సమస్యలుంటే దృష్టికి తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ,రిజిస్ట్రార్ ల వెంట ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, డా.మోహన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.