తెలంగాణ యూనివర్సిటీ లో సోమవారం వైస్ ఛాన్సలర్ చాంబర్లో తెలంగాణ వర్సిటీ డైరీని వైస్ -ఛాన్సలర్ టి యాదగిరి రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈ యాదగిరిరావు మాట్లాడుతూ.. డైరీలో యూనివర్సిటీ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, విద్యా కార్యక్రమాలు, ఇతర ఉపయోగకరమైన వివరాలు ఉన్నాయన్నారు.ఇది కేవలం ఒక డైరీ మాత్రమే కాదని, ఇది మన సమిష్టి కృషిని , మన ప్రగతిని, మన నిరంతర శ్రమను ప్రతిఫలించే ప్రతీక అన్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో టీచింగ్ నాన్ టీచింగ్ సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని తెలియజేశారు.ఈ డైరీ ని అద్భుతంగా రూపొందించడంలో విశేష కృషి చేసిన పబ్లికేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ని అభినందించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పబ్లికేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్ , కంట్రోలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ, యూజీసీ కోఆర్డినేటర్, డీన్లు ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ ఆపర్ణ, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.