
చండూరు వైస్ ఎంపీపీ అవ్వారి గీత శ్రీనివాస్ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గా బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ అధికారులు పై అధికారుల ఉత్తర్వుల మేరకు బాధ్యతలను అప్పగించారు. ఈనెల 1న పల్లె కళ్యాణి రవికుమార్ పై అవిశ్వాసం నెగ్గడంతో ఎంపీపీ స్థానం ఖాళీ అయింది. కాగా అధికారులు ఎంపీపీ స్థానాన్ని ఇన్ని రోజులు ఖాళీ ఉంచి నిబంధనలు తుంగలో తొక్కారనే విమర్శలు వినిపించాయి. ఎట్టకేలకు ఎంపీపీ బాధ్యతలను వైస్ ఎంపీపీ కి అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన అవ్వారి గీత జడ్పిటిసి కర్నాటి వెంకటేశం ఆశీస్సులు తీసుకున్నారు. ఉడతలపల్లి ఎంపీటీసీ కావాలి మంగమ్మ ప్రసాద్ తో పాటు గట్టుప్పల్ కు చెందిన మాజీ ఎంపిటిసి బండారు చంద్రయ్య, పున్న కిషోర్, చెరుపల్లి కృష్ణ, పున్న ఆనంద్, చిలువేరు అయోధ్య, జూలూరు పురుషోత్తం తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు. వైస్ ఎంపీపీ గా నియామకమైన కొద్ది రోజులకే ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం పట్ల స్వగ్రామమైన గట్టుప్పల వాసులు పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.