శ్రీరామ కల్యాణోత్సవంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ దంపతులు..

నవతెలంగాణ-తొగుట : శ్రీరామ కల్యాణోత్సవంలో వైస్ ఎంపీపీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవా రం మండలంలోని కాన్గల్ గ్రామంలో శ్రీరామ కళ్యా ణం  విజయవంతంగా నిర్వహించారు.ఈ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి దంపతులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరా మనవమి పండుగను ప్రజలంతా సుఖ సంతోషా లతో జరుపుకోవాలని కోరారు. శ్రీ రాముని దయ తో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారో గ్యాలతో ఉండాలని, పాడి, పంటలు బాగా పండా లని ఆకాంక్షించారు. శ్రీరామ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో రామ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.