ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వైస్ ఎంపిపి సుదాటి రవీందర్ రావు, ఆర్‌ఐ శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో గత రెండు రోజుల నుంచి పురుగులు వస్తున్నాయని విద్యార్థుల కుటుంబ సభ్యులు భూసేకరణ సమావేశానికి హాజరైన మంథని ఆర్డీఓ హనుమ నాయక్, వైస్ ఎంపిపి దృష్టికి తీసుకు పోయారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ ఆర్‌ఐ శ్రీధర్‌ను మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని ఆదేశించారు. దీంతో వైస్ ఎంపిపి సుదాటి రవీందర్ రావుతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను, ఉపాధ్యాయులను భోజనం ఎలాంటి ఉంది అని అడుగగా, పురుగులు వస్తున్నాయని తెలుపడంతో బియ్యాన్ని శుద్ధి చేసి, విద్యార్థులకు భోజనం పెట్టాలని నిర్వహకులకు సూచించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఉన్నారు.