అశ్వారావుపేటలో ప్రజాపాలన విజయోత్సవాలు… 

– పనుల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే…
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు బుధవారం అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పనులు జాతర నిర్వహించారు. మండలంలోని నారం వారిగూడెం,నారం వారిగూడెం కాలనీ, అశ్వారావుపేట, ఊట్లపల్లి,వినాయకపురం, మల్లాయిగూడెం,కావడిగుండ్ల, పెంచికలపాడు, గాండ్లగూడెం, బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి కోయ రంగాపురం, నారాయణపురం, ఆసుపాక, కొత్త మామిళ్లవారిగూడెం, తిరుమలకుంటలలో రూ.6 కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించిన సీ.సీ రోడ్లను ప్రారంభించారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ్ లక్ష్మీ, షాదీ ముభారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 85 మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల 84 వేల 764 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసారు. రామన్నగూడెం, మల్లాయిగూడెం గ్రామాలలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాలను ప్రారంభోత్సవం చేసారు. తిమ్మాపురం వద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నాటిన 50 హెక్టార్లలో నూతన  ప్లాంటేషన్ ప్రారంభించారు
కావడిగుండ్ల గ్రామంలో పూర్తి వసతులతో నిర్మించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ క్వార్టర్ ప్రారంభించారు. తన దత్తత గ్రామం చెన్నాపురం లో రూ 1 కోటి 6 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వసతుల పరిశీలించారు. గ్రామానికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని,అదే గ్రామంలో రోడ్డు నిర్మాణంలో స్థలం కోల్పోతున్న సోడెం దుర్గారావు గారికి ఇంటి స్థలం కోసం స్వయంగా ఆర్ధిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పెద్దవాగు ప్రాజెక్ట్ రింగ్ బండ్ పనులు పరిశీలన చేసారు. స్థానిక రైతులు అధైర్య పడొద్దు ఏ ఒక్కరికీ నష్టం జరగదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,పీఆర్ డీఈ శ్రీధర్, ఆర్ఐ కృష్ణ,కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, మిండా హరి క్రిష్ణ నండ్రు రమేష్ లు పాల్గొన్నారు.