దేశవ్యాప్త  సమ్మెను  జయప్రదం చేయండి : సీఐటీయూ

– దాసరి  పాండు  సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 16వ తేదీన జరుగు దేశ వ్యాప్తంగా సమ్మెలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు. సోమవారం భువనగిరిలొ ని  సుందరయ్య భవనంలో అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం   అంగ్వాడీ  టీచర్స్, హెల్పర్స్ యూనియన్  జిల్లా అధ్యక్షులు బూరుగు స్వప్న  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిందన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. అంగన్వాడీ  ఉద్యోగుల   పర్మినెంట్  చేయాలని  కనీస వేతనాలు పీఎఫ్ ఈఎస్ఐ  ఉద్యోగ భద్రత  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ చెల్లింపు తదితర సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నదన్నారు. పైగా ఐసిడిఎస్ కు బడ్జెట్ తగ్గించి ఐసిడిఎస్ నిరీవీర్యం చేస్తున్నదని ఏళ్ల తరబడి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను ఆయాలను పర్మినెంట్ చేయడం లేదన్నారు. వెట్టిచాకిరి చేసుకుంటున్నా  దని  అంగన్వాడి సెంటర్ రూము రెంటులు సకాలంలో వేతనాలు చెల్లించకుండా టి ఏ డి ఏ లు చెల్లించకుండా అంగన్వాడి సెంటర్ల కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ  చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లను రద్దు  చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తున్నదన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో టీచర్లు ఆయాలు ప్రజలు కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లాసహాయ కార్యదర్శి మాయ కృష్ణ   అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి హచ్ రమా కుమారి    నాయకులు  రుక్మిణి, భాగ్య, పద్మ, అంజమ్మ, ప్రమీల,  సోమేశ్వరి, మంజుల,  ప్రమిళ, జంగ మ్మ, సరిత, మహేశ్వరి, కల్యాణి, లక్ష్మి  పాల్గొన్నారు