నకుమురపై విదిత్‌ విక్టరీ

– ఫిడే క్యాండిడేట్స్‌ చెస్‌ 2024
న్యూఢిల్లీ: ఫిడే క్యాండిడేట్స్‌ చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతీ సూపర్‌ విక్టరీ సాధించాడు. హికారు నకుముర (అమెరికా)పై 29 ఎత్తుల్లో రెండో రౌండ్‌లో కీలక విజయం నమోదు చేశాడు. నల్లపావులతో ఆడిన విదిత్‌ గుజరాతీ ఎత్తులకు పైఎత్తులు వేసి నకుమురను కంగుతినిపించాడు. భారత యువ సంచలనం ఆర్‌. ప్రజ్ఞానందను సహచర గ్రాండ్‌మాస్టర్‌ డి గుకేశ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆరంభంలోనే దూకుడుగా ఆడి సహచర చైన్నై చిన్నోడికి రెండు పావులు కోల్పోయిన ప్రజ్ఞానంద మళ్లీ కోలుకోలేదు. 33 ఎత్తుల్లో గుకేశ్‌ విజయం సాధించాడు.