రోహిత్ నందా హీరోగా, ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్ మీద రంజిత్ ఎస్ నిర్మించిన సినిమా ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 3న థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత రంజిత్ మాట్లాడుతూ, ‘దర్శకులు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది’ అని అన్నారు.
‘ఇప్పటి వరకు ‘విధి’ మా సినిమా. ఈనెల 3 నుంచి ఇది ప్రేక్షకుల సినిమా. మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రంజిత్‌కు థ్యాంక్స్’ అని దర్శక ద్వయం అన్నారు. హీరో రోహిత్ నందా మాట్లాడుతూ, ”విధి’ కోసం పెట్టిన కాంటెస్ట్‌కు చాలా రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ థియేటర్లో బాక్సాఫీస్ వద్ద మా ప్రతినిధి ఉంటారు. వారికి కోడ్ చూపిస్తే టికెట్ ఇస్తారు. ఎక్స్‌ఎల్ యాప్ సపోర్ట్‌తో థియేటర్‌కు వెళ్తే.. కంటి చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేయవచ్చు’ అని చెప్పారు.