పదిలో విద్యా కుసుమాలు..

– గురుకుల విద్యార్థుల ప్రభంజనం..
– 11 మంది విద్యార్ధులకు 10 జీపీఏ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తంగళ్ళపల్లి మండల విద్యార్థులు విద్య కుసుమాలుగా అవతరించారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మండలంలోని నేరెళ్ల  తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ లోని పదో తరగతి విద్యార్థులు ఆరుగురు 10 జిపిఎ సాధించగా.. తెలంగాణ మ్రెస్ స్కూల్ విద్యార్థులు ముగ్గురు 10 జిపిఏ సాధించారు. అలాగే టి ఎస్ మోడల్ స్కూల్ మండేపల్లి విద్యార్థులు ఇద్దరు 10 జిపిఏ సాధించడంతో మండల వ్యాప్తంగా మొత్తం 11మంది విద్యార్థులు 10 జిపిఎ సాధించి ప్రభంజనం సృష్టించారు. మండల వ్యాప్తంగా 8 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారు.ఇ. హర్షిణి,ఎం. హవిలా,పి.జాగృతి,కె.జీవన,ఎన్.నేహా,డి. ప్రవని,ఎం.సంతోష్, ఇ. హర్షిత్,కె.నమిత,జి.అక్షయ,జి.రాజేశ్వరిని విద్యార్థులు 10 జిపిఎ సాధించారు. 10 జిపిఏ సాధించిన విద్యార్థిని విద్యార్థులను విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. అలాగే వీరితోపాటు సిరిసిల్ల పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన విద్యార్థినీ మోర స్పందన 10 జిపిఏ సాధించారు. విద్యార్థినినీ పలువురు అభినందించారు.