విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించిన విద్యార్థి సేన

నవతెలంగాణ –  కామారెడ్డి 
 మాదకద్రవ్యాల వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలియచేస్తూ వాటిపట్ల అప్రమత్తతో ఉండాలని గురువారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణకై మేముసైతం అంటూ  కామారెడ్డి జిల్లా కేంద్రంలో యంగ్ సైరన్ ర్యాలీ, అవగాహన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కే. వినయ్ అధ్యక్షతన నిర్వహించరు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నవారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి మూల స్తంభాలుగా  ఉన్నటువంటి విద్యార్థులు,  యువతను చెడు మార్గం వైపు తీసుకెళ్తూ వారి ఆరోగ్యాలను,  దేశ భవిష్యత్తును  డ్రగ్ర్స్ మహమ్మారి నాశనం చేస్తుందని దీనిపట్ల అందరూ అప్రమత్తతో ఉండాలని అవగాహన కల్పించారు.
డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రతి ఒక్క యువకుడు కదలిరావాలన్నారు. సామాజిక బాధ్యతతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థి సేనను వారి టీంను పలువురు  అభినందించారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థి సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు టి, కే, శివప్రసాద్, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్  కిష్టయ్య , రాజగంబీర్, ఎన్సిసి  సుధాకర్ , చంద్రశేఖర్ , విద్యార్థి సేన నాయకులు సాయి, రోహిత్, మహేష్, దీపక్  అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.