కాంగ్రెస్ సీనియర్ నేతకు భార్య వియెగం.. మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ..

నవతెలంగాణ మల్హర్ రావు
కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అందే సత్యనారాయణ భార్య అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పింవచ్చారు. ఆధైర్య పడవద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.