కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బిఆర్ఎస్ నాయకులు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్లిన కాంగ్రెస్ చోటా, మోటా నాయకులు సొంతగూటికి చేరేందుకు పావులు కదుపుతున్నట్లుగా విశ్వసనీయత సమాచారం. బీఆర్ఎస్ రెండు పర్యాయాలు ప్రభుత్వం అధికారంలో ఉన్న సరైన గుర్తింపు దక్కని అసమ్మతి నాయకులు ఇప్పుడు దుద్దిళ్ల విజయంతో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చినట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో దుద్దిళ్లకు ముఖ్య అనుచరులుగా ఉన్నవారే ఇప్పుడు సమాలోచనలో పడినట్లు వినికిడి.దీంతో కొద్దీ రోజుల్లో మంథని నియోజకవర్గంతోపాటు ముఖ్యంగా మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు పలువురుతో మంతనాలు జరుపుతున్నట్లుగా గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నియోజకవర్గం మొత్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లుగా సమాచారం. శ్రీదర్ బాబు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాక క్యాబినెట్ మంత్రివర్గంలో మంత్రి పదవి సైతం రావడంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తన అనుచర వర్గాన్ని ఓటమి చెందకుండా సత్తా చాటుతాడనే అభిప్రాయం వ్యక్తం కావడంతో పలువురు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.కాంగ్రెస్ లో చేరేవారిని దుద్దిళ్ల మాత్రం నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.పార్టీ మారకుండా దుద్దిళ్ల గెలుపుకోసం కృషి చేసిన తమను ప్రక్కన పెట్టి కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తారోమోని ప్రస్తుత కాంగ్రెస్ క్యాడర్ కొంత వరకు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.