– మేడిగడ్డ కంట్రోల్ రూమ్ కార్యాలయంలో తనిఖీలు
నవతెలంగాణ-మహదేవపూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజి రాజీవ్ రతన్ బృందం వచ్చింది. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ ఈఈ, డీఈలతో కలిసి స్థానిక హరిత హోటల్‌లో సమావేశమయ్యారు. బ్యారేజ్ వద్ద కంట్రోల్ రూమ్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.