నవతెలంగాణ-కొత్తూరు
మండలంలో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మల్లాపూర్ తండాలో బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, కొత్తూరు మున్సిపాలిటీలో బాతుక దేవేందర్ యాదవ్, పెంజర్లలో దేశాల భీమయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, మల్లాపూర్ తాండ సర్పంచ్ రవి నాయక్, వనం శేఖర్, బి రాజు, దేశాల జైపాల్ తదితరులు పాల్గొన్నారు.