
– జుక్కల్ నియోజకవర్గంలో బీబీ పాటిల్ ప్రచారానికి బ్రహ్మరథం
– దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ
నవతెలంగాణ – జుక్కల్
మోడీ రాకతో జహీరాబాద్ గడ్డపై కమలం జెండా ఎగరటం ఖాయం అని బీబీ పాటీల్ అన్నారు. గురువారం నాడు మండలంలోని పలు గ్రామాలలో బీజేపీ పార్టీ ముఖ్యనాయకులు మమ్మురంగా ప్రచారం చేసారు. ఈ సంధర్భంగా బీబీ పాటీల్ మాట్లాడుతు.. జుక్కల్ నియోజకవర్గంలో బీబీ పాటిల్ ప్రచారం ఊపందుకుంది. ఆయన చేపట్టిన ప్రచారం కు ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో కౌలాస్, మహమ్మదాబాద్, ఖండే బల్లూరు, వజ్రఖండి, దోస్ పల్లి, జుక్కల్ లో బీబీ పాటిల్ విస్తృత ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ఇంటింటి కి వెళ్లి ఓటును అభ్యర్థించారు. జుక్కల్ లో ని మార్కెట్ లో ప్రచారం చేసి ఓటును అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడారు.. దేశం కోసం ధర్మం కోసం పని చేసే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని తెలిపారు. మోడీ దేశ ఖ్యాతిని నలుమూలల చాటిన మోడీ మరోసారి ప్రధాని అవుతున్నారని, జహీరాబాద్ లో తనకు వేసే ప్రతి ఓటు మోడీ కి వేసినట్టే నని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నరేంద్రమోడీ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. మోడీ రాకతో జహీరాబాద్ పార్లమెంట్ లో కాషాయ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో నరేంద్రమోడీ నాయకత్వం లో దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, దేశం డిజిటల్ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతుంది అంటే అది మోడీ క్రృషేనని తెలిపారు. మోడీ హయాంలో వివాదాస్పద సమస్యలు పరిష్కరించి ప్రపంచం భారత్ వైపు చేసేలా మోడీ చేసిన క్రృషి మరువలేమని తెలిపారు. బీబీ పాటిల్ సమక్షంలో పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అరుణా పాటిల్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ తార, ప్రభారి గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగారాం తదితరులు పాల్గొన్నారు.