విజయ్ దేవరకొండ విశ్వరూపం

విజయ్ దేవరకొండ విశ్వరూపంవిజయ్ దేవరకొండ హీరోగా ‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాల దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో ఓ ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రంతో ఈ కాంబో అందరినీ థ్రిల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.’విడి12′ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది.  ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను ఈ ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌  పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం:  అనిరుధ్‌ రవిచందర్‌.