
తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి గా ఎంపిక చేసిన చైర్మన్, కమిటీ సబ్యులకు విజయ్ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రజక ముఖ్య నాయకులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా చిన్న రాంగారి విజయ్ గణేష్ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విజయ్ గణేష్ మాట్లాడుతూ నన్ను ఎంపిక చేసినందుకు తెలం గాణ రజక సంఘాల చైర్మన్ బసవరాజ్ శంకర్, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఎన్ని ఉన్నా “ఒకే సంఘం ఒకే నాయకుడు” రజక సంఘం ఒకటిగా పని చేస్తే నే ప్రభుత్వంతో కొట్లాడి హక్కులను సాధించుకు నేందుకు మేలు చేకూరుతుందని అన్నారు.