జీరోగా విజయ్‌ రాజా

Vijay Raja as Zeroశివాజీ రాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా లక్ష్మీనారాయణ.సి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ డ్రామా రూపొందుతోంది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి విలా సినిమాస్‌ బ్యానర్‌ పై ఆర్‌.లక్ష్మణ్‌ రావు, ఆర్‌.శ్రీను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జీరో’ అనే ఆసక్తికర టైటిల్‌ని ఖరారు చేసిన మేకర్స్‌ గ్లింప్స్‌ని రిలీజ్‌ చేశారు. నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఈ గ్లింప్స్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”జీరో’ గ్లింప్స్‌ చూశాను. చాలా బావుంది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. డైరెక్టర్‌ చాలా ఎమోషనల్‌గా తీశారు. నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించారు’ అని అన్నారు.
”జీరో’ గ్లింప్స్‌ నాకు చాలా నచ్చింది. సాయి కార్తిక‌ చాలా మంచి పాటలు ఇచ్చారు. సినిమా చాలా బావొచ్చింది’ అని శివాజీ రాజా చెప్పారు. హీరో విజరు రాజా మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం’ అని చెప్పారు. ‘మన స్పోర్ట్స్‌లో ఉండే పాజిటివ్స్‌, నెగిటివ్స్‌ని బేస్‌ చేసుకొని ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్‌, స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ సినిమాని తీశాం’ అని డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఇది మా ప్రొడక్షన్‌ నెంబర్‌ 2. ఈ సినిమాలో అందరికీ కనెక్ట్‌ అయ్యే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఉంది’ అని తెలిపారు.