విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘విడుదల-2’. ఈనెల 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత, శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు.
సినిమా విడుదల సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే సపోర్ట్ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల నా ‘మహారాజా’ చిత్రాన్ని సూపర్‌హిట్ చేశారు. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే అనుభూతి చెందాలి. అందరిని ఎంతో సంతప్తి పరిచే చిత్రమిది’ అని అన్నారు. హీరోలందరూ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. అలాంటి దర్శకుడు, విజరు సేతుపతి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో?, మిమ్మల్ని ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్తుందో ఈనెల 20న థియేటర్స్‌లో చూడబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధిస్తుంది’ అని నిర్మాత రామారావు చెప్పారు.