నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తమ్మినేని వీరభద్రంను సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. విజయ రాఘవన్‌తో పాటు పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నవీన్, కుమారుడు సంఘమిత్ర, కుమార్తె శృతి ఉన్నారు. ‘ఆస్పత్రిలో బుధవారం తమ్మినేనికి మైనర్ ఆపరేషన్ చేసి గుండె వద్ద పేస్ మేకర్ అమర్చారు. ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటున్నది. పార్టీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమ్మినేనిని పరామర్శించటానికి ఎవరూ ఆసుపత్రికి రావద్దని డాక్టర్లు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని సహకరించాలి’ అని పోతినేని విజ్ఞప్తి చేశారు.