మహేశ్వర మహా పిరమిడ్ ఛైర్మన్ గా విజయభాస్కర్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్  
పీఎస్ ఎస్ ఎమ్ జిల్లా కమిటీ ని హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మహేశ్వరమహా  పిరమిడ్ చైర్మన్ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి నీ నియమించడం జరిగింది అని జిల్లా కమిటీ అధ్యక్షులు సాయి కృష్ణ రెడ్డి శనివారం తెలిపారు. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి ఆశయ సాధనలో భాగంగా ధ్యానం శాఖాహారం పిరమిడ్ శక్తిని గ్రామ గ్రామానికి గడపగడపకు ఇంటింటికి తీసుకెళ్లడం కొరకు పి ఎస్ ఎస్ ఎం వ్యవస్థా పనిచేయాలని, ప్రతి పిరమిడ్ మాస్టర్ పనిచేయాలని ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కమిటీ. అధ్యక్షులుగా. బి. సాయి కృష్ణారెడ్డి  ఉపాధ్యక్షులుగా. మామిడి లక్ష్మణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అమరవాజి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా. రాజశేఖర్ కోశాధికారిగా సుఖాల లక్ష్మణ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా. ప్రేమ్ కుమార్ ముఖ్య సలహాదారులుగా బొడ్డు దయానంద్  గౌరవ సభ్యులుగా . శ్రీమతి లక్ష్మి రెడ్డి,యం. సాయినాథ్ .9మంది సభ్యులతోజిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని కమిటీ నిర్వహణ సభ్యులు తెలిపారు.