హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ ఐపీఎల్ 17వ సీజన్‌కు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో హసరంగ గాయపడిన సంగతి తెలిసిందే. వానిందు హసరంగ స్థానంలో సన్‌రైజర్స్ మరో శ్రీలంక స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకుంది. లెగ్ స్పిన్నర్ విజయకాంత్ త్వరలోనే సన్‌రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు. హసరంగను రూ.1.5 కోట్లను తీసుకున్న సన్‌రైజర్స్.. ఇప్పుడు విజయకాంత్ కోసం రూ.50 లక్షలు వెచ్చించింది.