– 15 మంది కన్వీనర్ల నియమకం
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా మాజీ ఎంపీ విజయశాంతిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. అలాగే ఆమెతో పాటు 15 మంది కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్లుగా మాజీ మంత్రులు డీకే సమరసింహారెడ్డి, పుష్పలీల, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేలు ఎం. కోదండరెడ్డి, వేం నరేందర్రెడ్డి, ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు ఒబేదుల్లా కోత్వాల్, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జైన్లను నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.