నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ మండలంలో గ్రామాలన్నీ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచినట్లు గజ్వేల్ మండలం బూరుగుపల్లి సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాలుగా గజ్వేల్ మండలంలోని 25 గ్రామపంచాయతీలో ముందున్నాయని ఆయన గుర్తు చేశారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయించి సిసి రోడ్లు, మురికి కాలలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె ప్రకతి వనాలు, ప్రతి సామాజిక వర్గానికి చెందిన ఆత్మగౌరవ భవనాలు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. మంత్రి హరీష్ రావు నాయకత్వంలో గజ్వేల్ నియోజకవర్గ ఉమ్మడి ఏడు మండలాలు అభివృద్ధిలో ముందు వెళ్తున్న అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన విధంగా మంత్రి హరీష్ రావు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆయన అన్నారు. అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు మురికికాలలో స్మశానవాటికలు పల్లె ప్రకతి వరులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అని చెప్పారు. గ్రామంలో ప్రజలు తెలంగాణ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, ఆసరా పింఛన్ తదితర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు ఆయన గుర్తు చేశారు. అనేక అభివృద్ధి పనులను గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించి ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. దీనికి అంతటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన అన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు అందుబాటులో ఉండవని ఆయన అన్నారు.