నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ రెక్టార్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ కె విజరుకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూహెచ్ 68 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో విజరుకుమార్‌రెడ్డిని రెక్టార్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆయన ఏడాదిపాటు లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకు రెక్టార్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు. రెక్టార్‌గా నియమించడంతో జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌గా రిలీవ్ చేశామని తెలిపారు. ఆయన ప్రస్తుతం ఎప్‌సెట్ కోకన్వీనర్‌గా కొనసాగుతున్నారు.