వైభవంగా ప్రారంభమైన విజయ్ పాఠశాల టాలెంట్ షో 

Vijay's school talent show started with a bang– పట్టుదల ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు
– విద్యార్థులకు సమయం విలువ తెలియాల్సిన అవసరం ఉంది
– చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

పట్టుదల ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, విద్యార్థులకు సమయం విలువ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ అన్నారు. ఈ మేరకు శనివారం అంగరంగ వైభవంగా విజయ్ పాఠశాల 44 వ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వాయిస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ, తెలుగు సినిమా ఇండస్ట్రీ పాటల రచయిత అండ్ సింగర్ మిట్టపల్లి సురేందర్, విజయ్ విద్యాసంస్థల కార్యదర్శి అమృతలత, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజయ్ హై స్కూల్ 44 వ టాలెంట్ షో సందర్భంగా చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వాయిస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ మాట్లాడుతూ.. బడి అన్నా పిల్లలన్నా నాకెంతో ఇష్టం అని తెలియజేశారు. నిజామాబాద్ గడ్డపై అడుగు పెట్టగానే నా మనసులో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నానుడి గుర్తొచ్చి నా హృదయం ఆనందంతో నిండి పోయింది. విజయ విద్యాసంస్థల్లో ఒక పండగ వాతావరణం నాకు కనిపించింది.గత నలభై ఏండ్లుగా నడుపబడుతున్న విద్యావ్యవస్థ విజయ్ పాఠశాల అని అన్నారు.
డాక్టర్ అమృతలత రచయితగా,రాజకీయ వేత్తగా వివిధ రంగాలలో ప్రవీణ్యురాలై విద్యార్థులను తీర్చి దిద్దుతున్న ఘనత ఆమెకే దక్కుతుందని చెబుతున్న నాకు గర్వంగా ఉంది.విద్యార్థులకు ఉపాద్యాయులు వారి అనుభవాలను గుర్తు చేయాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. తద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత నలభై ఏళ్లుగా విజయవంతంగా నడుపుతూ,సమాజంలో మంచి గుర్తింపును పొందడంలో విజయ్ హై స్కూల్ మహిళా శక్తిని నిరూపించుకుంటుంది.ఆడపిల్లలని ఆదరించి వారికి ప్రోత్సహిస్తే వారి జీవితాల్లో వెలుగును నింపినవారౌతాము.అమృతలతా అమ్మ ఒక సామాజిక వెత్తగానే కాకుండా అన్ని రకాలుగా గొప్ప మనస్తత్వం కలిగిన వారని పేర్కొన్నారు. పట్టుదల ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అమృతాలత జీవితంలో నిరూపితమైందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మరో అతిథి తెలుగు సినిమా ఇండస్ట్రీ పాటల రచయిత అండ్ సింగర్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ గడ్డ నిజామాబాద్ జిల్లాలో విజయ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాగుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మంచి అనుభూతి లభిస్తుందన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులు ప్రతిదీ నేర్చుకోవాలని అలా నేర్చుకోవడం  ద్వారా విద్యార్థులు గొప్పగా ఆలోచించగలుగుతారన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు సాగాలన్నారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు..
వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు 2023-24 సంవత్సరానికి అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం ముఖ్య అతిథులను విజయ్ పాఠశాల తరఫున మెమెంటో, శాలువాలతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అమృతలత, రమాదేవి, లలిత దేవి, విజయ భారతి, విజయ లక్ష్మి, మధు, కరస్పాండెంట్ ప్రభాదేవి అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.